బాలీవుడ్ స్టైలిష్  స్టార్ హీరోల్లో ఒకరైన ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ సినిమాల్లో స్టార్ గా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలతో పాటు చాలా డబ్బు కూడా సంపాదించాడు. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ వాళ్లది ఒక రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫామిలీ విషయానికొస్తే.. అతని తండ్రి నవాబ్ మహమ్మద్ మన్సూర్ అలీఖాన్ సిద్దిఖి పటౌడీ. మంచి పేరు పొందిన క్రికెటర్ మాత్రమే కాదు ఆయన ఒక నవాబ్ కూడా. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి సంబంధించి ఒక పెద్ద ప్యాలెస్ కూడా ఉంది. ఇది హర్యానాలో ఉంది. ఆ ప్యాలెస్ ని పటౌడీ ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్‌ను చూసేందుకు రెండు కళ్లూ చాలదు అంటున్నారు చూసిన వాళ్లంతా. పది ఎకరాల సువిశాల స్థలం కలిగిన పటౌడీ ప్యాలెస్‌లో 150 గదులున్నాయి. వాటిలో ఏడు బెడ్ రూమ్‌లు, ఏడు డ్రస్సింగ్ రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూములు ఉన్నాయి. ఎంతో పెద్ద స్విమ్మింగ్ ఫూల్ కలిగి ఉంది. గ్రీనరీ, ఆట స్థలాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ ప్యాలెస్ ఓ రాజ భవనంలా ఎప్పుడూ జిగేల్ జిగేల్ అంటూ బంగారంలా మెరుస్తూ ఉంటుంది.

సైఫ్ అలీఖాన్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ  2011లో చనిపోయాక ఆర్ధిక ఇబ్బందుల కారణం చేత ఆ ప్యాలెస్‌ను నీమ్‌రాణా హోటల్స్‌కు లీజుకు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు ఆ ప్యాలెస్ లో ఈ హోటల్ రన్ అయ్యింది. ఐతే  ఈ హోటల్ పార్టనర్ ఒకరు మరణించటంతో సైఫ్ అలీ ఖాన్ తమ ప్యాలెస్ ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం అప్పటిదాకా  సినిమాల్లో, బిజినెస్ లో తను సంపాదించిన డబ్బును మొత్తం ప్యాలెస్ కి  చెల్లించాడు. ఈ ప్యాలెస్ ని దక్కించుకోవడానికి దాదాపు 800 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. ఎట్టకేలకు ఆ ప్యాలెస్‌ను తిరిగి దక్కించుకున్నాడు సైఫ్‌. ప్రస్తుతం సైఫ్ తన భార్య కరీనా కపూర్‌, కొడుకు తైమూర్ అలీఖాన్‌తో హర్యానాలోని తమ పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నాడు.  

ఈ ప్యాలెస్ ని దక్కించుకున్న తర్వాత సైఫ్ మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వంగా నేను పొందాల్సిన ఇంటిని నేను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో తిరిగి పొందగలిగాను. గతం లేకుంటే మనం లేమని, అందులో చరిత్ర, సంస్కృతి, అందమైన ఫొటోగ్రాఫ్‌లు కలిగి ఉంది. ఇదోక ప్రత్యేకమైన సంపద నాకు. ఈ ప్యాలెస్ కు గొప్ప చరిత్ర ఉంది అని, అందుకే దీన్ని వదులుకోలేక  కస్టపడి మళ్ళి నా చేతికి తెచ్చుకున్నాను అని తెలిపాడు. ఈ పటౌడీ ప్యాలెస్ విలువ దాదాపు 800 కోట్లు అని అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: