ఎలాంటి ప్రకృతి విలయతాండవానికి ఎవరం ఏమి చేయలేము.. హైదరాబాద్ లో కొన్నిరోజులుగా పడుతున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి. ఈ టైంలో ప్రజలందరు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర వాసులంతా ఈ భారీ వర్షాల కారణంగా నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ప్రభుత్వం 550 కోట్ల రూపాయలతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వర్షం కారణంగా బాధుతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఇక బాధులను ఆదుకోవాలని సిఎం కె.సి.ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టాలీవుడ్ స్టార్స్ కదలి వస్తున్నారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ కోటి, నాగార్జున 50 లక్షలు, చిరంజీవి 50 లక్షలు, ఎన్.టి.ఆర్ 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.

తమని అభిమానించే ప్రేక్షకులకు, ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆదుకునేందుకు సినీ తారలు ఎప్పుడూ ముందుంటారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు స్టార్స్ తమ విరాళాలను ప్రకటించి గొప్ప మనసు చాటుకుంటున్నారు. తమ సినిమాలను చూసేందుకు టికెట్లు కొనే ప్రేక్షకులు కష్టం లో ఉన్నప్పుడు తమ వంతు సాయంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు స్టార్స్. సిఎం రిలీఫ్ ఫండ్ కు హైదరాబాద్ వరదల నష్ట నివారణ కోసం తారలు సాయం అందించడం తమ మంచి మనసుని చాటుకున్నారు.                                                                                            



మరింత సమాచారం తెలుసుకోండి: