ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సినిమాలకు సంబంధించిన ఏ విషయాన్నైనా.. వైరల్ చేయడం, ట్రోల్ చేయడం బాగా ఎక్కువైపోయింది. నెటిజన్లకు ఇంటర్నెట్ పై నాలెడ్జ్ పెరిగిపోవడంతో.. ప్రపంచంలో ఎక్కడ నుండైనా సరే ఓ సన్నివేశాన్నో.. పోస్టర్ నో కాపీ కొడితే వెంటనే పట్టేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శకనిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

పాతకాలం నటి ట్రైన్ నుండి దట్టమైన పొగ బయటకొస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేస్తున్న దృశ్యంతో ఉన్న పోస్టర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ పోస్టర్ కోసం ‘రాధేశ్యామ్’ టీమ్ ఎక్కువ కష్టపలేదని.. ఇదొక కాపీ పోస్టర్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ పోస్టర్ ఒరిజినల్ ఫోటోని బయటకి తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలానే ఇలాంటి పోస్టర్స్ ఇప్పటికే చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూపించారని.. ‘హ్యారీ పోటర్’ సినిమాలో కూడా ఇలాంటి ఓ సీన్ ఉందని గుర్తుచేస్తున్నారు.

అలానే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే హాలీవుడ్ లో ఇలాంటి పోస్టర్స్ సినిమాల కోసం వాడారని గూగుల్ లో ఉన్న కొన్ని ఫోటోలు తీసి షేర్ చేస్తున్నారు. గతంలో ‘రాధేశ్యామ్’ టీమ్ రిలీజ్ చేసిన ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా కాపీ ఆరోపణలు వినిపించాయి. ఈ ఫస్ట్ లుక్ ‘కంచె’ ఫస్ట్ లుక్ ని పోలి ఉందని కామెంట్స్ చేశారు. ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘బాహుబలి’ సినిమాల విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సినిమాల మేకర్స్ జాగ్రత్త పడితే మంచిదేమో! ఇలాంటి మరిన్ని అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: