సినిమాల్లో నటిస్తే ఆ కీర్తి శాశ్వతం అన్న భావన ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వెండి తెర అది. అక్కడ నటిస్తే ఆ రికార్డ్ వేరుగా ఉంటుంది. వందేళ్ళు గడచినా ఆ సినిమా చరిత్రలో అలాగే  ఉంటుంది. పైగా మంచి రెమ్యునరేషన్,  స్టాటస్ కూడా ఉంటాయి. అందుకే అందరి టార్గెట్ సినిమాలే. ముందుగా చాన్సులు రాక బుల్లి తెర మీద రాణించిన ఎంతో మంది తరువాత కాలంలో సినిమాల్లో నటించిన వారే. అయితే కొందరిని లక్ పలకరిస్తే మరికొందరినీ పక్కన పెడుతోంది.

ఇదిలా ఉంటే బుల్లి తెర మీద తన అందాలతో అలరిస్తున్న యాంకర్లలో వర్షిణి కూడా ఒకరు. ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే టాప్ లెవెల్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆమె డ్యాన్సులు, స్పాంటేనియస్ గా చెప్పే డైలాగ్స్. ఆమెలోని మెరుపు ఇవన్నీ కూడా టీవీ షో చూసే వారికి కట్టిపడేస్తాయన్నది వాస్తవం. ఇంతటి అందగత్తె ఇంకా సినిమాల్లోకి వెళ్ళలేదేంటి అన్న డౌట్లు కూడా చాలా మందికి వచ్చాయి.

అయితే వర్షిణి అలా డౌట్లు వచ్చిన వారికి సరైన జవాబు చెప్పబోతోంది. ఆమె ఏజెంట్ వినోద్ అన్న మూవీలో హీరోయిన్ గా నటించేందుకు సైన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోందిట. ఈ మూవీని బాబు బాగా బిజీ డైరెక్టర్ నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నారుట. ఈ మూవీలో వర్షిణికి   చక్కని నటనతో పెర్ఫార్మ్ చేయడానికే కాదు  తన ఇమేజ్ ని రెట్టింపు చేసుకునే అవకాశం కూడా  బాగా ఉందిట. అందుకే రెండవ మాటకు తావు లేకుండా ఎస్ అని చెప్పేసిందిట.  మొత్తానికి రష్మిక, అనసూయ వంటి వారు ఇప్పటికే అటు పెద్ద తెర, ఇటు బుల్లి తెర రెండిట్లో రాణిస్తున్నారు. ఇపుడు వర్షిణి వంతు వచ్చిందన్నమాట. మరి ఈ బ్యూటీ యాంకర్ కూడా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: