పవన్ కళ్యాణ్ - ఆలీ కాంబినేషన్ ఎలాంటిదో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. పవన్ నటించిన ఓ ఒకటి అరా మినహా మిగిలిన సినిమాలన్నింటిలోను ఆలీ దాదాపు నటించాడు. అది కూడా మామ్మూలు పాత్రలు కాదు, ప్రతీసారి పవర్ స్టార్ కు స్నేహితుడి పాత్రలలోనే యాక్ట్ చేసాడు ఆలీ. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, కాటమరాయుడు ఇలా చాలా సినిమాలలో పవన్ పక్కన మంచి పాత్రలు పోషించాడు ఆలీ.

ఇక స్క్రీన్ పైన స్నేహితులైన వీరు, నిజజీవితంలో కూడా మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసినదే. పంజా ఆడియో ఫంక్షన్లో పవన్ మాట్లాడుతూ.. "ఆలీ గనక నా సినిమాలో లేకపోతే ఏదోలా ఉంటుంది. ఆలీ నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది." అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు. వారిద్దరి మధ్యన ఎలాంటి బాండింగ్ ఉందనేది. దాదాపు వారిమధ్య ఒరే.. గిరే.. అనే సంబంధం ఉంటుందని టాలీవుడ్లో టాక్ వుంది.

ఇకపొతే పవన్ కళ్యాణ్ సినిమాలను కాస్త విడిచిపెట్టి రాజకీయాల్లోకి రావడంతో ఆ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. స్నేహితుడి పార్టీని కాదని, ఓ ప్రముఖ పార్టీకి ఆలీ మద్దతు ప్రకటించిన తరువాత ఇండస్ట్రీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆనాడు ఆలీ, పవన్ ల మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి కూడా తెలిసినదే. ఈ విషయమై పవన్ అభిమానులు ఆలీపైన గుర్రుగా వున్న సంగతి తెలిసినదే.

మరి ఆ ఎఫెక్ట్ ఆలీ సినిమాలపైన పడిందో ఏమో గాని ఆ ఇష్యూ తరువాత ఆలీకి సినిమా అవకాశాలు తగ్గాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నిక అనంతరం పవన్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 5, 6 లైన్ లో వున్నాయి. కానీ ఎందులోనూ ఆలీ పేరు ఉన్నట్టు దాఖలాలు కనబడటం లేదు. ఇదే విషయమై ఈ మధ్య మీడియా ఆలీని ప్రశ్నిస్తే సమాధానాన్ని దాటవేశారు. ఈ సంవత్సరం వెళ్లాల్సిన బాక్స్ మామిడి పళ్ళు  కూడా ఆలీకు ఇంకా చేరలేదట. దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు రాజకీయాల్లోనూ, సినిమా పరిశ్రమలోనూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని.

మరింత సమాచారం తెలుసుకోండి: