సినిమా హాళ్ళు అంటే సగటు మనిషికి వినొద కేంద్రాలు. అలసిపోయిన వారంతా అక్కడకు వెళ్ళి సేదతీరుతారు.  అది ఏ సినిమా ఎలాంటి సినిమా అన్నది కూడా చూడకుండా వినోదాన్ని చిత్తగించడం మెజారిటీ జనాభాకు అలవాటు, ఇంట్లో టీవీలో సినిమా వస్తుంది. అంతే కాదు ఇపుడు ఓటీటీ వచ్చేసింది. ఏకంగా స్మార్ట్ ఫోన్ లోనే సినిమా చూడవచ్చు కానీ ఎందుకో వెండి తెర మీద సినిమా చూస్తే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఇక ఏడు నెలలుగా థియేటర్లు తెరచుకోలేదు. దాంతో సినీ గోయర్స్ కి కాళ్ళూ చేతులూ ఆడలేదు. అదే సమయంలో సరైన జాబ్స్ లేక కాసులు కూడా ఆడలేదు.

ఇవన్నీ ఇలా ఉంటే కొన్ని చోట్ల సినిమా హాళ్ళు ఈ నెల 15 నుంచి తెరచారు. వీకెండ్ కూడా హాళ్ళలో జనం లేరంటే ఆశ్చర్యమే మరి. కానీ సినిమా హాళ్ళకు జనాలు రావాలంటే చాలా టైం పడుతుంది అంటున్నారు. ఇపుడిపుడే కరోనా తగ్గుముఖం పడుతోంది. దాంతో మరో రెండు నెలల తరువాత అంటే కొత్త ఏడాదికి సినిమా హాళ్స్ సందడి చేస్తాయని సినీ పెద్దలు అంచనా కడుతున్నారు. సరే కానీ ఈ రెండున్నర నెలలు ఈగలు తోలుకుంటూ థియేటర్లను నడిపేది ఎవరు అందుకే చాలా మంది మేము హాల్స్ తెరవం అనేశారు.

ఇక ఐమాక్సులు తెరచారు. కానీ అక్కడ కూడా ఇదే సీన్. ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. ఇక్కడ  మ‌రో విషయం చెప్పుకోవాలి. కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ గా ఇక్కడ రిలీజ్ చేయడం లేదు. సినిమా హాళ్ళు కిటకిటలాడాలంటే టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ చేయాలని అంటున్నారు. అపుడే సినిమా హాళ్ళ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది అని కూడా సూచిస్తున్నారు. అయితే ఈ మధ్యలో చిన్న సినిమాలు రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటే తప్ప పెద్ద సినిమాలు విడుదల అయ్యేలా లేవు. దాంతో బకరాలు ఎవరు అవుతారు అన్నది కూడా ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది. ఇవన్నీ చూస్తూంటే అంతా పోలోమంటూ ఒక్కసారిగా సంక్రాంతికి  వెండి తెర మీదకు పడిపోతారు అని అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: