బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ఆమె ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన విదేశీ నటిమణి ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. నిజానికి అలియా భట్ కి ఎన్టీఆర్ సరసన నటించాలంటే మహా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్ తో కలిసి ఒక్కసారైనా ఒక సినిమాలోనైనా నటించాలని ఆమెకు ఎప్పటినుంచో కోరిక ఉందని వెల్లడించారు. అలాగే తెలుగు సినిమాల్లో నటించాలని ఆమెకు ఎప్పటినుంచో ఒక తపన ఉండేదని.. ఐతే రాజమౌళి పుణ్యమా అంటూ తొలిసారే ఒక ప్రతిష్టాత్మక తెలుగు చిత్రంలో నటించబోతున్నానని.. అందుకు తనకు ఎంతో సంతోషం గా ఉందని అలియాభట్ వెల్లడించారు.


ఇకపోతే తెలుగులో రెండవ సినిమాలో నటించడానికి కూడా ఆలియా భట్ తపన పడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక తెలుగు సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని కూడా తెలుస్తుంది. ఇకపోతే తన మొట్టమొదటి తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నట్టు ఆలియాభట్ వెల్లడించారు.


నవంబర్ నెలలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డేటింగ్ కి వెళ్ళడానికి కూడా రెడీ అని ఆలియాభట్ చెప్పారు. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కొమరం భీం కు సంబంధించిన వీడియో అక్టోబర్ 22వ తేదీన విడుదల కాబోతుందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ టీజర్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పరిస్థితులను బట్టి సినిమా చిత్రీకరణ ప్రారంభం అవ్వడానికి ఇంకా కొన్ని రోజుల సమయం ఆగాల్సిందేనని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: