బిగ్ బాస్ సీజన్ 4లో ఫిజికల్ గా ఫిట్ గా ఉండి.. గేమ్ ప్లాన్ బాగానే ఉన్న హౌజ్ మేట్ అఖిల్ తను ఆట మీద కన్నా మోనాల్  మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఉన్నాడు. అందుకే ఆటలో అతను వెనకపడినట్టు ఉన్నాడు. కుమార్ సాయి వెళ్తూ వెళ్తూ అఖిల్ ను కరివేపాకుతో పోల్చడంతో అఖిల్ అంతర్మదనంలో పడ్డాడు. అందుకే సోమవారం ఎపిసోడ్ లో అఖిల్, మోనాల్ ల మధ్య నామినేషన్ ప్రక్రియ జరుగగా అఖిల్ మోనాల్ ను కాపాడకుండా తనంతట తాను సేవ్ చేసుకున్నాడు.

అయితే ఇంకా టాస్కుల్లో అఖిల్ తన పర్ఫార్మెన్స్ పెంచుకోవాల్సి ఉంది. లేకపోతే అఖిల్ వెనకపడే ఛాన్స్ ఉంది. అఖిల్ మారకుండా ఇంకా మోనాల్ వెంటే పడితే మాత్రం అతను కూడా హౌజ్ నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. అఖిల్ నువ్వు మారాల్సిందే లేదంటే నువ్వు కూడా బయటకు వస్తావ్ అంటూ ఆడియెన్స్ ట్రోల్ చేస్తున్నారు. అఖిల్, మోనాల్ ల మధ్య ఈ రిలేషన్ కు బ్రేక్ వేస్తేనే కాని అఖిల్ తన అసలు ఆటని బయటపెడతాడని తెలుస్తుంది.

అఖిల్ తనకు ఉన్న క్రేజీ ఫాలోవర్స్ కోసమైనా సరే మారక తప్పదు. ఇక తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ లో కూడా అఖిల్ విన్నర్ గా కాకుండా రన్నర్ గా నిలుస్తున్నాడు. మరి అఖిల్ తన ఆట గేర్ మార్చి విన్నర్ గా నిలిస్తేనే టాప్ 5లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. మరి అఖిల్ తన ఆటని ఏమాత్రం మార్చుకుంటాడో చూడాలి. ఓ పక్క మిగతా హౌజ్ మేట్స్ అంతా హౌజ్ లో రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్న సమయంలో అఖిల్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పొచ్చు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: