అవునూ.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో అనుకున్న సినిమా యంగ్ హీరో శర్వానంద్ తో తీస్తున్నారట. అయితే ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? అది ఏ సినిమా? వెంకటేష్ ఎందుకు చేయట్లేదు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. "నేను శైలజ", "ఉన్నది ఒకటే జిందగీ", "చిత్రలహరి" వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆయన అప్పట్లో హీరో రామ్, కీర్తి సురేశ్ జంటగా నేను శైలజ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత   "ఆడాళ్లూ… మీకు జోహార్లు" అనే యూనిట్ సబ్జెక్ట్ చేయాలనుకున్నాడు. సీనియర్ హీరో వెంకటేశ్‌కి కథ చెప్పడం, ఆయన నచ్చి ఓకే చెప్పడం చకచకా జరిగిపోయారు. తమ కలయికలో చిత్రం రూపొందుతోందని వీరిద్దరూ పలు వేదికల్లో చెప్పుకొచ్చారు. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు చిత్రాలు చేస్తూ కెరీర్ సాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇపుడు ఆ కథతో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. శర్వానంద్‌ హీరోగా "ఆడాళ్లూ… మీకు జోహార్లు" చేయనున్నారని తెలుస్తోంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. శర్వాతో "పడి పడి లేచె మనసు" చిత్రాన్ని నిర్మించిన సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. జనవరి నెలాఖరు నుంచి షూటింగు ప్రారంభించాలని అనుకుంటున్నారు. తొలుత వెంకటేశ్‌ని హీరోగా అనుకున్నప్పటికీ… శర్వానంద్‌ శైలికి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే, సీన్లలో మార్పులు చేశారట. చూడాలి మరి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ కి కిషోర్ తిరుమల అయినా ఓ హిట్టు ఇస్తాడేమో.. శర్వానంద్‌ శైలికి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే, సీన్లలో మార్పులు చేశారట. చూడాలి మరి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ కి కిషోర్ తిరుమల అయినా ఓ హిట్టు ఇస్తాడేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: