మన తెలుగులో చేయడానికి బాలీవుడ్ హీరోలు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. అయినా సరే వారికి తెలుగులో అవకాశాలు రావటం అనేది ఇప్పుడు కాస్త కష్టంగా మారింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు కొంతమంది తెలుగు లో విలన్ పాత్రలు చేయడానికి గత కొన్ని రోజులుగా ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే మన తెలుగు హీరోలు మాత్రం ఇప్పుడు ఖర్చు తక్కువగా ఉండాలి కాబట్టి ఇక్కడి వారిని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక హీరో బాలీవుడ్ విలన్ కం హీరో మీద ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ విలన్ ఎవరు ఏంటి అనేది తెలియదుగానీ... బాలీవుడ్ విలన్ ని నిర్మాతలు దాదాపుగా స్టార్ హీరో సినిమాకు ఒప్పించినట్లుగా సమాచారం. దాదాపుగా అక్షయ్ కుమార్ అయి ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. లేకపోతే మాత్రం రణవీర్ సింగ్ అయినా అయి ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇంతకు ఏంటీ అంటే అల్లు అర్జున్ తన సినిమాలో బాలీవుడ్ విలన్ నీ తీసుకోవాలని అతను పట్టుబడుతున్నట్లు సమాచారం. అతను నటిస్తున్న పుష్ప  సినిమాలో అక్షయ్ కుమార్ ని విలన్ గా తీసుకోవాలని అడిగాడని టాక్.

దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు సుకుమార్ కి కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అటు సుకుమార్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఏ  పాత్ర అయినా సరే అక్షయ్ కుమార్ సమర్థవంతంగా నటిస్తూ ఉంటాడు కాబట్టి అతనిని తీసుకుంటే బాగుంటుంది అనే భావన వ్యక్తం చేశాడట. దీనితో నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే పూర్తిస్థాయి విలన్ గా తీసుకోవడం లేదని ఈ సినిమాలో అతను ఒక మాఫియా డాన్ గా కనపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: