బిగ్ బాస్ హౌజ్ లో మంగళవారం వచ్చింది అంటే చాలు కెప్టెన్సీ టాస్క్ మొదలుపెడతాడు బిగ్ బాస్. వచ్చే వారం కెప్టెన్ గా ఎవరు ఎంపికవుతారో వాళ్లను ఎంపిక చేసే క్రమంలో కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచిన కొందరికి ఫైనల్ టాస్క్ ఇచ్చి కెప్టెన్ గా ఒకరిని ఎంపిక చేస్తాడు. ఇక కెప్టెన్ గా గెలిచిన వారికి ఒక వారం నామినేషన్స్ నుండి ఇమ్యునిటీతో పాటుగా హౌజ్ లో అందరికి డ్యూటీస్ వేయడం.. ఇక ఎలాంటి గొడవలు కాకుండా చేయడం చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ మన్ళవారం టాస్క్ లో విసిగించే రాక్షసులు.. మంచి మనుషులు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రాక్షసులు ఎంత విసిగించినా సరే మంచి మనుషులు ఏమి అనకూడదు అంతేకాదు వారు ఏం చేసినా సరే నవ్వుతూ ఉండాలి. ఇలా హౌజ్ మేట్స్ ను రెండు భాగాలుగా చేసి ఈ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారు. ఈ వారం కెప్టెన్ ఎవరుతారు అన్నది తెలియాల్సి ఉంది.

రాక్షసుడు టీం లో అవినాష్, అరియానా, అఖిల్ లు ఉన్నట్టు తెలుస్తుంది. అవినాష్ తన డైలాగ్స్ తో రాక్షసుడిగా తన సత్తా చాటినట్టు తెలుస్తుంది. చూస్తుంటే రాక్షసుడు టీం గెలిస్తే అవినాష్ కే కెప్టెన్ గా ఇచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. మరి అవినాష్ కెప్టెన్ అవుతాడా లేదా అన్నది చూడాలి.  


                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: