మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ డైరక్టర్ కు అయినా డ్రీం ప్రాజెక్టే అవుతుంది. దశాబ్ధ కాలంగా ఉన్నా ఇప్పటికి చిరుతో సినిమా ఛాన్స్ అందుకోలేని డైరక్టర్స్ ఉన్నారు. కాలం కలిసి రాకో డైరక్టర్ చెప్పిన కథ నచ్చకనో చిరు వారితో చేయలేదు. ఇక చిరుతో హ్యాట్రిక్ సినిమా ఛాన్స్ అందుకున్నాడు వి.వి.వినాయక్. రమణ రీమేక్ తో వచ్చిన ఠాగూర్.. కత్తి రీమేక్ గా వచ్చిన ఖైది నంబర్ 150 సినిమాలతో చిరుకి సూపర్ హిట్ ఇచ్చాడు వినాయక్.

ఇక ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. చిరుతో మొదటి మీటింగ్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రస్థావించారు వినాయక్. రాజా రవీంద్ర సహాయంతో చిరుతో మొదటి మీటింగ్ జరిగిందని.. అప్పుడు ఆయన నాకు రమణ సినిమా చూశావా మనకి సెట్ అవుతుందా అన్నారు. సూపర్ గా ఉంటుందని చెప్పాను.. ఆ టైం లో ఆ బాధ్యత నా మీద పెట్టారు.

అయితే ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ కొన్ని తాను చిరు కోసం రాసిన ముఖ్యమంత్రి కథలో సన్నివేశాలు వాడాను. చిరు కోసం సిఎం కథ సిద్ధం చేశానని.. అది వర్క్ అవుట్ కాలేదని అన్నారు వినాయక్. చిరు రీమేక్ చేయాలని అనుకుంటే వెంటనే వినాయక్ గుర్తొచ్చేస్తాడు. మరి వినాయక్ సిఎం కథ చేస్తాడా లైట్ తీసుకుంటాడా అన్నది చూడాలి. హీరోగా వినాయక్ సీనయ్య సినిమా చేశాడు. అయితే ఆ సినిమా రిలీజ్ పై మాత్రం నోరు విప్పలేదు వినాయక్.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: