బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో దాన్ని మించే సినిమా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు సూపర్ స్టార్స్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం పక్కా అని చెప్పొచ్చు. అందుకు శాంపిల్ గా వదిలిన అల్లూరి టీజర్ అదరగొట్టగా త్వరలో రాబోతున్న కొమరం భీమ్ టీజర్ తో సోషల్ మీడియా మోత మోగించాలని ఫిక్స్ అయ్యారు.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నట విశ్వరూపంతో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్ర దుమ్ముదులిపేస్తాడని తెలుస్తుంది. కొమరం భీం టీజర్ ఈ నెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేశారు. 22న ఉదయం 11 గంటలకు ఈ టీజర్ వస్తుంది. 11 గంటలకు ముహుర్తం ఫిక్స్ చేసి మరి రికార్డుల రచ్చ మొదలు పెట్టాలని చూస్తున్నాడు రాజమౌళి.

సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్.. కొమరం భీమ్ పాత్రలో తారక్ ఇద్దరు నువ్వా నేనా అనేలా చేశారట. తప్పకుండా వీరి నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ కొమరం భీమ్ టీజర్ ఎలా ఉంటుంది.. ఎన్ని నిమిషాలు ఉంటుంది.. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుంది.. ఎన్ని మిలియన్ వ్యూస్ సాధిస్తుంది.. ఎన్ని కోట్ల హృదయాలు గెలుస్తుంది.. ఎన్ని సంచలనాలు సృష్టిస్తుంది.. అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచడంలో రాజమౌళి దిట్ట ఆల్రెడీ అల్లూరి టీజర్ అదరగొట్టగా.. ఇక రాబోతున్న భీం టీజర్ కూడా షేక్ చేస్తుందని అంటున్నారు.                                                 
 

మరింత సమాచారం తెలుసుకోండి: