కెరీర్ మొదట్లో గ్లామరస్‌ పాత్రలే చేసినా క్రమంగా ఆ స్థాయి నుండి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల స్థాయికి ఎదిగింది నటి అనుష్క. బెంగళూరుకు చెందిన ఈ అమ్మడు అస్సలు కన్నడ సినిమాలు చేసిందే లేదంటే నమ్మడం కష్టమే. మలయాళం జోలికి అస్సలే వెళ్ళని ఈ భామ కేవలం ఈమెను తెలుగు, తమిళ సినిమాలే సౌత్ ఇండియాలో లీడింగ్ హీరోయిన్ గా నిలబెట్టాయని చెప్పాలి. అయితే ఈమె ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గిం చేసిందని చెప్పచ్చు. చాలా తక్కువగా అది కూడా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది.  ఆమె నటించిన తాజా మూవీ సైలెన్స్‌ తెలుగులో నిశ్శబ్దం పేరిట విడుదల  అయింది.

 మొత్తం ప్యాన్ ఇండియా లెవల్ లో అన్ని బాషలలో ఈ సినిమా రిలీజ్ అయినా పెద్దగా మంచి పేరు అయితే తెచ్చుకోలేక పోయింది. అయితే అనుష్క శెట్టి ఒక్క నిశ్శబ్దం సినిమా తప్ప మరే సినిమాలో చేస్తున్నట్టు అప్డేట్స్ లేవు. నిశ్శబ్దం విడుదలయ్యాక అయినా అనుష్క మిగితా ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తుందా? అని చూసినప్పటికీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఎలాంటి అప్డేట్ ఇవ్వ లేదు. అసలు ముందు ముందు సినిమాలు తీస్తుందా లేదా అనే అనుమానంలో అనుష్క అభిమానులు ఉన్నారు.

దానికి తోడు ఆమె పెళ్లి గురించి పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. పెళ్లి కోస‌మే కెరీర్ ని కూడా వ‌దిలేయ‌నుంద‌నే ప్ర‌చారం కూడా జరుగుతోంది. అయితే ఆమె సన్నిహితులు ఆమె మరిన్ని మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోందని చెబుతున్నారు. నిజానికి ఆమె రెండు సినిమాలు ఒప్పుకున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాలని ఆమె పుట్టిన రోజున ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: