ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.... యూట్యూబ్ ఛానల్స్ లో పలు వీడియోల ద్వారా పాపులర్ అయిన గంగవ్వ.. ‘బిగ్ బాస్4’ లో ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది. పెద్దగా చదువుకోనప్పటికీ.. తెలంగాణ యాసలో ఓ చిన్న పిల్ల మాదిరి మాట్లాడుతూ ఉండే గంగవ్వ.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ కూడా ఆమెను ఓ చంటి పిల్లలాగా ఆప్యాయంగా చూసుకున్నాడు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా..

ఎక్కువ రోజులు ఈమె హౌస్ లో కొనసాగలేకపోయింది. సొంత ఇల్లే లక్ష్యంగా ‘బిగ్ బాస్’ హౌస్ కు వెళ్ళబోతున్నట్టు గంగవ్వ తెలిపిన సంగతి తెలిసిందే. ఈమె ‘బిగ్ బాస్4’ విన్నర్ గా నిలవకపోయినా.. హోస్ట్ నాగార్జున ఈమెకు సొంత ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే ఇంటి పనులు మొదలుపెట్టారని గంగవ్వ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొత్త ఇంటికి సంబంధించి ఆమెకు ఫోన్లు మెసేజ్ లు వస్తున్నాయని ఆమె తెలిపింది.

హౌస్ నుండీ బయటకు వచ్చేసినప్పటికీ.. ‘ ‘బిగ్ బాస్’ డాక్టర్లు ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ఫోన్లు చేస్తున్నారని’ గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది.ఇక ఇదే క్రమంలో ‘బిగ్ బాస్4’ విన్నర్ ఎవరవుతారు అనే ప్రశ్నకు గంగవ్వ… అవినాష్ అని సమాధానం ఇచ్చింది. హౌస్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ గేమ్ ఆడుతున్న అవినాషే విన్నర్ అవుతాడని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చూడాలి.. మరి గంగవ్వ చెప్పింది ఎంతవరకూ నిజమవుతుందో..!

 పాపం నాగార్జున, బిగ్ బాస్ ల రాజకీయాలకు బలైపోయి ఈసారి మంచి టాలెంటెడ్ కంటెన్స్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ అయిపోయాడు. ఈ ఈ  వారం నామినేషన్ లో అవినాష్ తో పాటు అభిజీత్, దివి, అరియానా, మోనాల్, నోయల్ ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్ లో కొనసాగుతున్నారు. ఇలాంటి మరిన్నో ఆసక్తికర విషయాలు కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: