ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి..... "బాహుబలి" సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ని ఒక పెద్ద నేషనల్ స్టార్ ని చేసింది. ఆ సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.  ‘బాహుబలి'(సిరీస్) తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. ప్రభాస్ కు ఏర్పడిన క్రేజ్ వల్ల కమర్షియల్ గా అయితే పర్వాలేదనిపించింది. అసాధారణమైన రికార్డులను కూడా సొంతం చేసుకుంది. సినిమాకి కనుక మంచి టాక్ వచ్చి ఉంటే కనుక.. 1000కోట్ల వరకూ కూడా కలెక్ట్ చేసేది అనడంలో అతిశయోక్తి కాదు. ఇక ‘సాహో’ డౌన్ అవ్వడానికి ప్రధాన కారణం మ్యూజిక్ అని కూడా చెప్పాలి. సినిమా ప్రారంభమైనప్పటి నుండీ పూర్తయ్యేవరకూ ఈ చిత్రానికి సంగీత దర్శకుడెవరు అన్న విషయాన్ని దర్శకనిర్మాతలు తెలుపలేదు.


చివరాఖరికి కొంతమంది బాలీవుడ్ సంగీత దర్శకులతో పాటలను కంపోజ్ చేయించుకున్నారు. దాని వల్ల తెలుగు నేటివిటీ మిస్ అవ్వడంతో సినిమా పై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈసారి ‘రాధే శ్యామ్’ విషయంలో నిర్మాతలు ఆ తప్పు చెయ్యడం లేదు. జస్టిన్ ప్రభాకరన్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్టు ప్రకటించారు. కోలీవుడ్లో పలు సినిమాలకు పనిచేసిన జస్టిన్.. తెలుగులో ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి పనిచేసాడు.

ఆ చిత్రానికి మంచి మ్యూజిక్ కూడా ఇచ్చాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పెద్ద పెద్ద సినిమాలకు ఇతను పనిచేయలేదు కానీ మంచి పాటలు అందిస్తాడు అనే నమ్మకాన్ని అయితే సంపాదించుకున్నాడు. ఆ రకంగా చూసుకుంటే.. ప్రభాస్ టీం మంచి పని చేసినట్టే అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్  మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: