ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నాడు.. రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు..తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. ఇక పవన్ కళ్యాణ్ రెండో సినిమా ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు..
అయితే ఈ సినిమా ఇంకా మొదలవకపోవడానికి కారణం క్రిష్ అని తెలుస్తుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ రావడానికి లేట్ అవుతుందని క్రిష్ వైష్ణవ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లోగా ఈ సినిమా ని పూర్తి చేసిన పవన్ తో సినిమా చేయాలన్నది క్రిష్ ఆలోచన.. అయితే ఈ విషయాన్ని పవన్‌కు కూడా చెప్పేశాడట. ‘వకీల్ సాబ్’ సినిమాను నవంబరుకల్లా పూర్తి చేసి, డిసెంబరుకు రెడీగా ఉంటే.. షూటింగ్ పున:ప్రారంభిద్దామని.. ఈ మేరకు మిగతా నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు కూడా సర్దుబాటు చేసుకుంటున్నామని పవన్‌కు క్రిష్ చెప్పేశాడట. నిర్మాత రత్నం ఆధ్వర్యంలో అందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మరి క్రిష్ కోరుకున్నట్లు పవన్ డిసెంబరుకల్లా ఈ సినిమా కోసం రెడీగా ఉంటాడో లేదో చూడాలి.