ప్రభాస్ పుట్టిన రోజునాడు విడుదల కాబోతున్న ‘రాధే శ్యామ్’ ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' మోషన్ పోస్టర్ గురించి ప్రభాస్ అభిమానులు అత్యంత  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 23 విడుదల కాబోతున్న ఈ పోస్టర్ ను ట్రేండింగ్ గా మార్చడానికి ప్రభాస్ అభిమానులు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.


అయితే ఈ మోషన్ పోస్టర్ ఇంకా రిలీజ్ కాకుండానే ఆ పోస్టర్ కాపీ అంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం ప్రభాస్  అభిమానులకు కలవరపాటు కలిగిస్తోంది. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పోస్టర్ లో రైలు బండి నుంచి దట్టమైన పొగ బయటకు వస్తున్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఈమూవీ పీరియాడికల్ మూవీ అనే సంకేతాలు ఇస్తోంది అంటూ ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోయారు.


అయితే ఈ అనందం ఎక్కువ రోజులు నిలబడ లేదు ఇప్పుడు ఆ పోస్టర్ కు సంబంధించి ఒరిజినల్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టర్ కి ప్రభాస్ మూవీ పోస్టర్ కి కేవలం కలర్ మాత్రమే డిఫరెన్స్ గా కనిపిస్తోంది అంటూ ఆ రెండిటినీ పక్కపక్కన పెట్టి ‘రాధే శ్యామ్’ పోస్టర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం మొదలు  అయిపోయింది గతంలో ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఇదే స్థాయిలో ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


వరుణ్ తేజ్ ‘కంచె’ ‘రామ్ లీల’ సినిమా పోస్టర్లతో ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ని పోల్చుతూ నెటిజన్స్ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేసి నానా హడావిడి గతంలో చేసారు. దీనితో ఈ మూవీ దర్శకుడు  రాధాకృష్ణ ప్రభాస్ పై గతంలో సుజిత్ ‘సాహో’ విషయంలో చేసినట్లుగా మరోసారి ప్రయోగం  చేస్తున్నాడా అంటూ అభిమానులు అదిరిపోతున్నారు. అంతేకాదు  ప్రభాస్ ఈసినిమా పై మరింత జాగ్రత్తలు తీసుకోమని వేల సంఖ్యలో మెసేజ్ లు కూడ పెడుతున్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: