తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు మన జక్కన్న.ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో మన రాజమౌళి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. మళ్ళీ అదే రేంజ్ లో సినిమా తీయాలనే పట్టుదలతో,టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే RRR. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అల్లూరిగా, చెర్రీ... కొమురం భీంగా తారక్ నటిస్తున్నాడు.

 ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో పాటుగా, రామ్ చరణ్ టీజర్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా కొమరం భీమ్ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రాబోతోంది. దీని గురించి కొన్ని రోజులుగా కౌంట్‌డౌన్‌తో ఊరిస్తూ వస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. రోజు రోజుకూ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముందు డేట్ మాత్రమే చెప్పిన చిత్ర బృందం.. టీజర్ రిలీజ్ టైం కూడా వెల్లడించింది. గురువారం ఉదయం 11 గంటలకు ఆ టీజర్ రాబోతోంది.

 ఇక టీజర్‌లో తారక్ ఎలా కనిపిస్తాడు.. చరణ్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఆయా హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోగా.. తారక్ వాయిస్ ఓవర్ అదే స్థాయిలో ప్రశంసలందుకుంది. భీమ్ టీజర్లో తారక్ బీస్ట్ అవతార్‌లో కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ వాయిస్ ఓవర్ కూడా వావ్ అనిపించేలా ఉంటుందని.. పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయని చెప్పుకుంటున్నారు. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని చిత్ర బృందం ఏమేర అందుకుంటుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: