రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ క్లైమాక్స్‌ కి వచ్చేసిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి రాజ్‌ తరుణ్‌ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. కుమారి 21ఎఫ్ లాంటి సినిమాతో హిట్ కొట్టిన ఈయన యూత్ లో మంచి క్రేజ్ తో పాటు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ లో సక్సెస్‌ అనేది ఈయన కెరీర్ లోనే రాలేదు. నాలుగేళ్ల నుంచి చాలా సినిమాలు చేస్తున్నా ఈయనకు వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు పడుతూనే ఉన్నాయి.

ఈ బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులే రాజ్‌ తరుణ్‌ ని ఇప్పుడు ఇబ్బందులో పడేస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌ లేటెస్ట్ రిలీజ్ ఒరేయ్‌ బుజ్జిగా సినిమాకి కూడా ఫ్లాప్‌ టాక్ వచ్చింది. థియేటర్ల బంద్‌తో ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీకి అక్కడ కూడా నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా అస్సలు బాలేదనే కామెంట్స్ రావడంతో రాజ్‌ తరుణ్‌ మార్కెట్ మరింత దిగజారిందని అంటున్నారు. సినిమా సినిమాకి రాజ్ తరుణ్ రేంజ్ పడిపోతుండడంతో, రాజ్‌ తరుణ్‌ సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్‌ అయ్యే టైమ్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు కొందరు.

 ఒకరకంగా అందాల రాక్షసి తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర కూడా ఇలాగే ఫ్లాపులతో హీరో నుంచి సపోర్టింగ్‌ రోల్స్‌కి పడిపోయాడు. కానీ ఆ రోల్స్ తో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు రాజ్‌ తరుణ్‌ సినిమా కూడా ఇలాగే మారిపోయేలా కనిపిస్తుంది అంటున్నారు.  లేదా రాజ్‌ తరుణ్‌ మరో ఆప్షన్‌ చూసుకోవడం బెటర్‌ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: