బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో రంజుగానే సాగుతోంది. దాదాపుగా అందరు కంటెస్టెంట్లు జనాలకు రిజిస్టర్ అయిపోయారు. బిగ్ బాస్ వారికి ఇస్తున్న టాస్కులు వారు ప్రదర్శిస్తున్న టాలెంట్ అన్నీ కూడా సగటు జనాలకు ఎంటర్టైన్మెంట్ గానే ఉన్నాయి. అయితే ఇపుడు బిగ్ బాస్ హౌజ్ లో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు. ఆ ఏడవ వారం ఆరు నామినేషన్లు వచ్చాయి. ఇందులో ఒకరు గ్యారంటీగా వెళ్ళిపోతే మిగిలేది పదకొండు మందే. మరి ఇప్పటికి మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన బిగ్ బాస్ అందులో నుంచి ఇద్దరిని మళ్ళీ బయటకు లాగేశారు. అలా వచ్చిన వారిలో అవినాష్ ఒక్కరే స్టాండర్డ్ అయ్యాడు.

మరి బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎలిమినేషన్ లో మోనాల్ గజ్జర్ కచ్చితంగా వెళ్ళిపోతుందని అంతా భావిస్తున్నారు. ఆమె గత వారమే వెళ్లిపోవాలి. కానీ కుమార్ సాయిని పంపించారు అన్న భావన ఆడియన్స్ లో ఉంది. మొత్తానికి ఆమె మళ్ళీ నామినేషన్ లోకి రావడంతో ఆమెను కచ్చితంగా పంపుతారు అని టాక్. అదే జరిగితే బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ బాగా తగ్గిపోతుంది. ఈసారి మసాలాతో కధ రక్తికట్టిద్దామని  బిగ్ బాస్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

అభిజిత్, అఖిల్ మోనాల్ మధ్యన ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిపించాలని బిగ్ బాస్ చూసినా సాధ్యపడలేదు. ఇపుడు ఏడవవారం కూడా చప్పగా సాగుతోంది. మరి స్టఫ్ ఇచ్చే గ్లామర్ కంటెస్టెంట్ ని ఎవరినైనా ఈసారి పంపుతారా అన్న  చర్చ అయితే ఉంది. మరి కొద్ది రోజుల్లో యాభై రోజులకు  బిగ్ బాస్ సీజన్ ఫోర్ చేరుతుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ అతి పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని అంటున్నారు. అలా కనుక చేయకపోతే హౌజ్ లో మాత్రం చప్పగానే వాతావరణం ఉంటుందని ఆడియన్స్ కూడా అంటున్నారు. చూడాలి మరి.






మరింత సమాచారం తెలుసుకోండి: