ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్రీకరించిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఆయన ఏమి చేసిన ఓ సెన్సేషనే. ఇపుడు తాజాగా ప్రభాస్ ఇరవైవ సినిమాగా రాధేశ్యాం సినిమా రూపొండుతున్న సంగతి తెలిసిందే.

ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు హంగామా నెట్టింట్లో మొదలైంది. అతడి ఫ్యాన్స్. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా.. అప్పుడే కౌంట్ డౌన్ షురూ చేశారు. బాహుబలి గెటప్ లో చిరునవ్వులు చిందిస్తోన్న ప్రభాస్ ఫొటోను పెట్టి కామ‌న్ డీపీని విడుద‌ల చేశారు. ఫ్రేమ్ చుట్టూ ప్రభాస్ న‌టించిన సినిమాల పేర్ల‌ను పెట్టారు. బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.



ఇక ఇప్పటికే తమ హీరో ఫిట్ నెస్ ట్రైనర్ కు పెద్ద కారు ఇవ్వడంతో పొంగిపోయిన ప్రభాస్ అభిమానులు నిన్నంతా ఆ సందడి సందడి చేశారు. నేడు ప్రభాస్ డీపీతో ముందుకొచ్చారు. ప్రభాస్‌ దగ్గర చాలాకాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌కు ప్రభాస్ ఖరీదైన రేంజ్‌ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో లక్ష్మణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ఫ్యామిలీతో కలిసి కారు ముందు ప్రభాస్ తో కలిసి ఫొటోలు తీసుకొని సంబరపడ్డాడు లక్ష్మణ్. ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు.

అంతేకాదు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించడమే కాదు.. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. అజయ్ దేవ్‌గణ్.. మహా శివుడి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు  ఈ చిత్రంలో ప్రభాస్, పెదనాన్న కృష్ణంరాజు, శ్రీరాముడి తండ్రైన దశరథుడి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ సినిమాలో సీతగా పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: