బిగ్ బాస్ సీజన్ 4 లో ఏడవవారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్తారు. ఈవారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉండగా హౌజ్ నుండి బయటకు వెళ్లే ఛాన్స్ ఎవరికి ఉంది.. ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న ఇంటి సభ్యులు ఎవరు అన్నది చూస్తే.. వారాలు గడుస్తున్నా కొద్దీ హౌజ్ మేట్స్ మధ్య టఫ్ ఫైట్ ఏర్పడుతుంది. నామినేషన్సే ఆటలో చాలా కీలకంగా మారుతున్నాయి. అందుకే హౌజ్ లో ప్రతి స్టెప్ ను జాగ్రత్తగా తీసుకుంటున్నారు హౌజ్ మేట్స్.

ఇక ఏడవవారం నామినేషన్స్ లో మోనాల్, అభిజిత్, దివి, అవినాష్, అరియానా, నోయెల్ ఉన్నారు. వీరిలో అభిజిత్, అవినాష్, అరియానాలు సేఫ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే అఖిల్ కోసం మోనాల్ త్యాగం చేసింది కాబట్టి అఖిల్ ఫాలోవర్స్ అంతా ఆమెను సపోర్ట్ చేసి ఈసారి కూడా మోనాల్ ఎలిమినేట్ అవకుండా ఓట్లు వేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఎటొచ్చి నోయెల్, దివి ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు.

హౌజ్ లో మొదటి రెండు వారాలు సరదాగా కనిపించిన నోయెల్ గతవారం కెప్టెన్ గా అయ్యే ముందు వరకు చాలా వెనకపడ్డాడు. టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫాం చేసింది లేదు. ఈవారం హౌజ్ కెప్టెన్ అయినా కూడా నోయెల్ కు ఆ ఇమ్యునిటీ లభించలేదు. ఫైనల్ గా నోయెల్ కూడా ఈవారం ఎలిమినేషన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ఇక దివి కూడా టాస్కుల్లో ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా తప్ప గట్టి పోటీ ఇవ్వట్లేదు. మాట్లాడితే అమ్మా రాజశేఖర్ కు సపోర్ట్ గా ఉండటమే తప్ప తను స్టాండ్ తీసుకున్నది ఏది లేదు. అందుకే ఈ వారం దివి కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు టాక్. మరి దివి, మోనాల్ లోనే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా.. లేక మోనాల్ ను మీద వ్యతిరేకతతో ఆమెను ఎలిమినేట్ చేసేలా ఓట్లు వేస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: