దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, ఓలియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలైలో రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా కాటుకు అది వచ్చే ఏడాదికి వెళ్ళింది.

 ఈ సినిమాలో నందమూరి ఫ్యామిలీ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండటంతో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అదీ కాక ఈ సినిమాలో తమిళ్ నుండి కొందరు, బాలీవుడ్ నుండి కొందరు నటులను రోప్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఆర్ఆర్ఆర్ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజమౌళి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వారు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నీమధ్యనే రామోజీ ఫిలిం సిటీలో మొదలయ్యింది. రేపు రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో రామరాజు ఫర్ భీమ్ వీడియో విడుదల చేయబోతున్న క్రమంలో దాని కోసం భీబత్సంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా షూటింగ్ లో అలియా నవంబర్ మొదటి వారంలో షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: