అక్కినేని సమంత ఇప్పటికి అనేక తెలుగు సినిమాల్లో నటించింది. చక్కటి  అందం, అభినయంతో కనిపించి తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతో మాయ చేసింది ఈ భామ. ఎంతో అద్భుతంగా నటిస్తూ చక్కగా రాణిస్తోంది. మొదట సమంతమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక అప్పటి నుండి మంచి ఫేమ్ ని సంపాదిస్తూనే ఉంది. ఇలా ఈమె అక్కినేని వారి ఇంట కోడలు అయిపోయింది. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.



చక్కటి నటనతో తనదైన శైలితో యిట్టె ఆకట్టేసుకుంటుంది. ఎంతో ఫేమస్ అయిపోయిన సమంత సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది.....? ఈ విషయం లోకి వస్తే ..... ఈమె అసలు హీరోయిన్ ఎలా అయ్యిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సమంత చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది అప్పుడు తన స్నేహితురాలి పెళ్ళికి  సమంత వెళ్లింది. ఆ పెళ్ళిలో ఈమె ఫోటోలకు ఫోజులిచ్చింది. అక్కడ దిగిన ఫోటోలు మరుసటి రోజు పేపర్లో రావడం జరిగింది.  ఓ షాప్ ఓనర్ సమంతకి ఫోటోలు ఉన్నాయని చెబితే గాని సమంతకి తెలియలేదు. తరువాత సమంతను వెతుక్కుంటూ వచ్చి తన బట్టల షాప్ కి పబ్లిసిటీ చేయమంటే సరదాగా చేసింది ఈ భామ .

ఇలా ఆ తరవాత  ఒక కంపెనీ వాణిజ్య ప్రకటన లో నటించే చాన్స్ ఇచ్చింది సమంతకి.  సమంతని యాడ్ లో చూసిన మూవీ డైరెక్టర్స్ సినిమాల్లో చిన్న పాత్ర చేసే అవకాశం కలిపించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఏ మాయ చేసావే చిత్రం లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇలా ఆమె జీవితం మలుపు తిరిగిపోయింది. ఉన్నత స్థాయికి చేరింది ఈ బ్యూటీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: