మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరి డైరక్షన్ లో చేస్తాడన్న దాని మీద క్లారిటీ రాలేదు. లేఎస్ట్ టాక్ ప్రకారం కొరటాల శివతో చరణ్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. 2013లో వీరి కాంబోలో ఓ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది కాని ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఫైనల్ గా కొరటాల శివతో చరణ్ సినిమా ఉంటుందని టాక్.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషఒల్ రోల్ చేస్తున్నాడు. ఆచార్యలో చరణ్ 30 నిమిషాల పాత్ర అరుపులు పెట్టిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ తో కొరటాల శివ సినిమా ఉంటుందని టాక్. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య తర్వాత ఓ సినిమా చేసి ఆ నెక్స్ట్ కొరటాల శివ సినిమా ఉంటుందని అంటున్నారు.

కొరటాల శివ ఆచార్య తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. బన్నీ సినిమా తర్వాత చరణ్ తోనే కొరటాల శివ సినిమా ఉంటుందని అంటున్నారు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు తీసిన ప్రతి సినిమా హిట్ అందుకున్న కొరటాల శివ చిరుతో చేస్తున్న ఆచార్యతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. చిరు, బన్నీ, చరణ్ ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో కొరటాల శివ అదిరిపోయే స్కెచ్ వేశాడని చెప్పొచ్చు.                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: