మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అనేక సినిమాల్లో నటించి ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. అలానే హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా తన ఇంటి పేరు మీద కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్‌ను స్టార్ట్ చేసిన తండ్రి చిరు తో వరుసగా 'ఖైదీ నంబర్ 150 , 'సైరా నరిసింహా రెడ్డి ' సినిమాలు నిర్మించాడు ఈ హీరో.  అప్పట్లో తండ్రి అక్కినేని నాగేశ్వర రావు కోసం నాగార్జున.. ఇప్పట్లో నాన్న మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్‌ ఆ పని చేసారు. వివరా ల్లోకి వెళితే..

 నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు  బాటలో నాగార్జున  సినీ రంగ ప్రవేశం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. అలానే నిర్మాతగా కూడా నాగార్జున రాణిస్తున్నాడు. అన్నపూర్ణ స్డూడియో పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నాగార్జున నిర్మించడం జరిగింది. తండ్రి నాగేశ్వరరావు హీరోగా చేసిన 'ప్రేమాభిషేకం' ' శ్రీరంగనీతులు', బుచ్చిబాబు' శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి' తో పాటు మనం చిత్రాలని అక్కినేని నాగార్జున నిర్మించడం మనకి తెలిసినదే. ఈ పరంగా చూస్తుంటే తండ్రి తో సినిమాలు నిర్మించిన హీరోలుగా రికార్డులకు ఎక్కారు ఈ స్టార్ హీరోలు.

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు హరికృష్ణ. కానీ హరికృష్ణ ఫుల్ టైమ్ హీరోగా పనిచేయలేదు. ఈ రకంగా తండ్రి హీరోగా సినిమాలు నిర్మించిన కథానాయకుల లిస్టు లో  చోటు సంపాదించుకున్నారు నాగార్జున, చరణ్.   నాగార్జున హీరోగా చెయ్యడమే కాక  ఇద్దరు కొడుకులు, మేనల్లుళ్లతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఈ జనరేషన్‌ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కు.... ఆ జెనరేషన్ లో అక్కినేని నాగార్జున కి  మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: