నందమూరి  బాలకృష్ణ కీలక పాత్రలలో నటించి తానే దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టారు. అదే నర్తనశాల. తన తండ్రి పెద్ద ఎన్టీఆర్ సినిమాల్లో నర్తనశాల అంటే తనకు ఇష్టం అని బాలయ్య చాలా సార్లు చెబుతూ ఉండేవాడు. అందుకే దాన్ని రీమేక్‌ చేయాలని సంకల్పించి ఆరోజుల్లో స్టార్ క్యాస్టింగ్ తో ఈ సినిమా మొదలు పెట్టారు. శ్రీహరి, సౌందర్య, ఉదయ్ కిరణ్ లాంటి ఎందరో దివంగత నటులతో ఈ సినిమై ప్లాన్ చేశారు. ఎన్నో అంచనాలతో ప్రారంభమైన ఈ సినిమ షూటింగ్‌ కొద్ది రోజులకే సౌందర్య మరణంతో ఆగిపోయింది.

ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల రిక్వెస్ట్ మేరకు విడుదల చేస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేసారు. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ఈరోజు కూడా శ్రీహరి భీముడి గెటప్ లో ఉన్న లుక్ రిలీజ్ చేశారు. 17 నిమిషాలున్న ఈ సినిమా తాలూకు సన్నివేశాలని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్‌ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేస్తున్నారు.

 ఈ సినిమా ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు కూడా ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్ భారీగా ప్లాన్ చేశారు. అదేంటంటే ఈ సినిమాని మినిమం టికెట్ ధ‌ర‌ని 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. కానీ ఎంత అయినా పెట్టి ఈ సినిమాని చూడొచ్చు. ఈ నేపధ్యంలో కొంత‌ మంది బాలయ్య అభిమానులు `న‌ర్తనశాల‌` టికెట్ ని రూ10 ల‌క్షల‌కు కొనాల‌ని ఫిక్స్ అయినట్లు టాక్. చూడాలి ఆయనా అభిమానులు కలిసి ఈ సినిమా ద్వారా ఎంత సేవ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: