సౌత్ స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా సమంత తన సత్తా చాటుతుంది. పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న సమంత కమర్షియల్ సినిమాల కన్నా ఫీమేల్ సెంట్రిక్ కథలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మజిలీ, ఓ బేబీ, జాను సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సమంత నందిని రెడ్డి డైరక్షన్ లో హర్రర్ మూవీకి రెడీ అవుతున్నట్టు టాక్.

ఇక కరోనా లాక్ డౌన్ టైం లో తన ఇంటి పైన కూరగాయలు పండించిన సమంత ఇప్పుడు కొత్తగా సాకీ అని క్లాత్ బిజినెస్ లోకి దిగింది. సమంత డ్రీం ప్రాజెక్ట్ అయిన సాకి క్లాతింగ్ కు అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టింది అమ్మడు. తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ కు సాకి క్లాత్ కాస్టూంస్ ధరించి అలా ప్రమోట్ చేస్తుంది.

తప్పకుండా సమంత సాకి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. అక్కినేని నాగార్జున తరహాలోనే బిజినెస్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంది సమంత. అందుకే సాకి కోసం తనే ప్రమోట్ చేస్తూ సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా సమంత తన సోషల్ బ్లాగ్స్ లో సాకి బ్రాండ్ కాస్టూం ధరించి చూపరులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా రెటైర్ అయిన తర్వాత తన ఇమేజ్ తో బిజినెస్ తో సెటిల్ అవ్వాలని ఇప్పటినుండే పర్ఫెక్ట్ ప్లాన్ చేసింది సమంత.                                                                                  \



మరింత సమాచారం తెలుసుకోండి: