రెండేళ్ల క్రితం కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సమ్మతమైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, గత ఏడాది కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండుగ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుని ఆయన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది.

ఇక ప్రస్తుతం యువ దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. యువ భామ నభ నటేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూడు లిరికల్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకొని సినిమాపై భారీ క్రేజ్ ని ఏర్పరచడం జరిగింది. మంచి లవ్ స్ట్రో గా పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు జరగగా సెన్సార్ బోర్డు వారు దీనికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రకటన రావడం జరిగింది. 

ఇకపోతే ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి యూనిట్ ని అభినందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ఆకట్టుకునే ట్విస్ట్ తర్వాత ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుందని అంటున్నారు. అనంతరం సెకండాఫ్ లో కొంత మెల్లగా ప్రారంభమైనప్పటికీ ఆపై వచ్చే సన్నివేశాలు మెల్లగా ఊపందుకొని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ వరకు ప్రేక్షకులందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయట. యువత తో పాటు ఈ సినిమాని అన్నివర్గాల ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారని వారు చెప్పడం జరిగిందట. మొత్తంగా చూసుకుంటే ఈ సోలో బ్రతుకే సో బెటర్
సినిమాని దర్శకుడు సుబ్బు షాకింగ్ గా ఇంత అద్భుతంగా తీస్తారని తాము ఊహించలేదని చెప్పారట సెన్సార్ సభ్యులు. అలానే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మరొక మంచి సక్సెస్ ఫుల్ మూవీ గా నిలిచే అవకాశం ఉందని చెప్పారట. కాగా ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: