టాలీవుడ్ లో నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్య మీనన్ తో సినిమా చేయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నిత్యామీనన్ మాత్రం ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎందుకు దూరంగా ఉంటుంది ఏంటి అనే కారణం స్పష్టంగా తెలియకపోయినా నిత్యమీనన్ మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఐతే ఈ అసలు ఆమె సినిమాల్లోకి రాకపోవడానికి ప్రధాన కారణం వేరే ఉంది అని సినీ పరిశీలకులు అంటున్నారు.

ఆమె బరువు భారీగా పెరిగిందని దాదాపుగా 90 కేజీల వరకు బరువు వెళ్లిందని దీనితోనే ఆమెను పక్కన పెట్టారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తమిళ సినిమాల్లో మాత్రం ఆమెకు కొన్ని కీలక పాత్రలు వస్తున్నాయి. అటు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయినా సరే ఆమె మాత్రం వాటిని సమర్థవంతంగా వాడుకోలేక పోతుంది అనే భావన వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

అసలు ఏంటి అనేది ఒక సారి చూస్తే నిత్య మీనన్ ఇప్పుడు ఒక తమిళ హీరో ని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు ఫ్యామిలీల పెద్దలు కూడా మాట్లాడుకున్నారని గత కొంతకాలంగా తమిళ హీరోతో ఆమె ప్రేమలో ఉందని ఈ ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారని సమాచారం. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి అనేది తెలియక పోయినా వాస్తవానికి ఆగస్టులో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉందని టాక్. అయితే హీరో ఇంట్లో ఉన్న కొన్ని కార్యక్రమాల కారణంగా వివాహం వాయిదా పడిందని సమాచారం. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: