టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో భారీగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా పలువురు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభం నాటి నుండి కూడా ప్రేక్షకులు,  అభిమానుల్లో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. దానికి ప్రధాన కారణం అంతకుముందు ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు అత్యద్భుత విజయాన్ని అందుకోవడమే కాక ఆ రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి వందల కోట్ల రూపాయల కలెక్షన్ ఆర్జించి దేశవిదేశాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఇకపోతే ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ఒకరకంగా రాజమౌళి యొక్క బాక్సాఫీస్ స్టామినాకు కొంత అగ్ని పరీక్షే అని అంటున్నారు.

అయితే ఇటీవల కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తం కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన సమస్యల్లో ఇరుక్కోవడంతో మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా పూర్తిగా నిలిచిపోయింది. అలానే థియేటర్స్ కూడా ఎక్కడికక్కడ మూత బడ్డాయి. అయితే ఇటీవల థియేటర్స్ మళ్ళి తెరుచుకోవడం జరిగింది. కానీ ఈ కరోనా పరిస్థితుల్లో  ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్ కు వస్తారు అనేది కొంత అనుమానంగా మారింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది కాబట్టి ఆ సమయానికి కరోనా వ్యాక్సిన్ రావాడం, చాలావరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం జరుగుతుందని, అలానే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. అందువలన ఖచ్చితంగా ఈ సినిమా బాహుబలి రికార్డులు అన్ని కూడా బద్దలు కొట్టి రాజమౌళి కెరీర్లో అత్యద్భుత విజయం సాధించిన టాప్ సినిమాగా నిలుస్తుందని పలువురు ప్రేక్షకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో, మరి రాజమౌళి ఈ సినిమాతో ఏ రేంజి హిట్ అందుకున్నాడో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: