బిగ్ బాస్ సీజన్ 4లో ఏడవవారం కెప్టెన్సీ కోసం ఇద్దరు స్నేహితులు పోటీ పడుతున్నారు. కొంటె రాక్షసులు మంచి మనుషులు టాస్క్ లో భాగంగా బెస్ట్ పర్ఫార్మర్ గా ఇద్దరిని సెలెక్ట్ చేయమని కెప్టెన్ కు బిగ్ బాస్ ఆదేశించగా అందుకు నోయెల్ అవినాష్, అరియానాల పేర్లు చెప్పాడు. ఇక బుధవారం కెప్టెన్సీ టాస్క్ లో అవినాష్, అరియానాలు పాల్గొననున్నారు.

మరి ఈ టాస్క్ లో ఎవరు విన్ అవుతారు.. ఎవరు లూసర్ అవుతారన్నది రేపు తెలుస్తుంది. కెప్టెన్సీ కోసం అవినాష్, అరియానాల మధ్య టఫ్ ఫైట్ ఏర్పడుతుంది. ట్రాలీ ఇచ్చి హౌజ్ మేట్స్ ను అందులో ఉంచుకుని గార్డెన్ ఏరియాలో ఇచ్చిన సర్కిల్స్ లో తిప్పే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరు మధ్యలో ఆగిపోతారో వారి కెప్టెన్సీ టాస్క్ నుండి ఓడిపోయినట్టు అవుతుంది. ఈ టాస్క్ ను ఎవరు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తారో వారే కెప్టెన్ అవుతారు.

ఈ టాస్క్ లో అరియానా, అవినాష్ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చేలా ఉన్నారు. అయితే ఆట విషయంలో అసలు కాంప్రమైజ్ అవని అరియానా అవినాష్ కోసం వెనక్కి తగ్గుతుందా లేక పోటీ పడి మరి టాస్క్ కంప్లీట్ చేస్తుందా అన్నది చూడాలి. ఈ సీజన్ లో అరియానా రోజు రోజుకి తన ఆటతో ఆకట్టుకుంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.                                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: