బిగ్ బాస్ సీజన్ 4 లో రేటింగ్స్ ఎలా ఉన్నాయన్నది చూస్తే ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ తో రికార్డ్ టి.ఆర్.పి అందుకున్న బిగ్ బాస్ రాను రాను గ్రాఫ్ తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 టి.ఆర్.పి రేటింగ్స్ లో చాలా వెనూకపడ్డదని తెలుస్తుంది. బోటా బోటీ రేటింగ్స్ తో షో నడుస్తుందని అంటున్నారు. ఓ పక్క ఇండియాలో నంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ మా అని నాగార్జున చెబుతున్నారు. అదేదో బిగ్ బాస్ వల్లే అని పాపం హౌజ్ మేట్స్ ఫీల్ అవుతున్నారు.

కాని బిగ్ బాస్ షోకి ఈమధ్య రేటింగ్స్ బాగా తగ్గాయని తెలుస్తుంది. వీక్ డేస్ లో 8, 8.5 అలా రేటింగ్స్ వస్తుంటే వీకెండ్ లో నాగార్జున వల్ల 11 కు అటు ఇటుగా రేటింగ్స్ వస్తున్నాయట. 18 పాయింట్స్ తో మొదలైన బిగ్ బాస్ టి.ఆర్.పి రోజు రోజుకి తగ్గుతుందని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కు ఫాలోవర్స్ బాగానే ఉన్నా సరైన టి.ఆర్.పి రేటింగ్స్ మాత్రం రావట్లేదని చెప్పొచ్చు.

16 మంది హౌజ్ మేట్స్ తో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 లో ఇప్పటికే ఆరు వారాల్లో ఏడుగురు హౌజ్ మేట్స్ ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఈ వారం కూడా ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్తారో చూడాలి. బిగ్ బాస్ షో రేటింగ్స్ తగ్గుతున్నాయని లీక్స్ వచ్చినా వాటికి భిన్నంగా ఎలిమినేషన్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: