ఈ దసరాకి నితిన్, రష్మిక నటించిన సూపర్ హిట్ మూవీ భీష్మ వస్తుంది. ఇంతకీ భీష్మ వచ్చేది ఎక్కడికి అంటే బుల్లితెర మీద భీష్మ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సినిమా సూపర్ హిట్ అవగానే జెమిని భారీ మొత్తానికి ఈ సినిమా రైట్స్ కొనేసింది. ఇక దసరా సర్భంగా ఈ నెల 25న భీష్మ టెలికాస్ట్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులకు పండుగ మరింత జోష్ నింపేలా చేస్తుందని చెప్పొచ్చు.

నితిన్, భీష్మల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు వెంకీ కుడుముల డైరక్షన్, డైలాగ్స్ కూడా సినిమాకు బలమని చెప్పొచ్చు. దసరాకి జెమిని టివిలో ఈ సినిమా వస్తుంది. బాక్సాఫీస్ పై సూపర్ హిట్ అయిన ఈ సినిమా బుల్లితెర మీద కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు స్వర మహతి సాగర్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయ్యింది.

వెంకీ కుడుముల మొదటి సినిమా ఛలో కూడా ఎంటర్టైనర్ గా నిలిచింది. భీష్మ కూడా అదే పంథాలో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ ఇయర్ లాస్ట్ సూపర్ హిట్ భీష్మ అని చెప్పాలి. అప్పటి నుండి కరోనా వచ్చి థియేటర్లు బంద్ అవ్వడం జరిగింది. మరి నితిన్ భీష్మ బుల్లితెర మీద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్ లో నితిన్ రంగ్ దే సినిమా చేస్తున్నాడు.                                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: