అవును సినీ నిర్మాతలు అంతా ఇప్పుడు టెన్షన్ లో పడిపోయారు. మామూలు నిర్మాతలు సరే బడా సినిమాలు ప్రొడ్యూస్ చేసే నిర్మాతలు అయితే నిద్రలు కూడా పట్టక ఇబ్బంది పడుతున్నారు. కరోనా ఎంటర్ అయ్యాక  మారిన లెక్కలతో ముందుగా అనుకున్న బడ్జెట్ లతో సినిమాలు సెట్స్ మీదకు ఎంతవరకు వెళతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఫైనల్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు కాస్ట్ కటింగ్ లకు రెడీ అవుతూ ఉండడం సినిమాల బిజినస్ మీద కూడా ప్రభావం చూపనుంది.  

అగ్ర హీరోలేమో పాన్ ఇండియా ఫీవర్ నుండి బయటకి రావట్లేదు. దీంతో ఆ నిర్మాతలు అందరూ టెన్షన్ లో ఉన్నాయి. బాహుబలి, సాహో లాంటి సినిమాలతో తెలుగు సినిమా పాన్ ఇండియా వెనుక పాడడం మొదలుయింది.  కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తమను తాము నిరూపించుకోవాలన్న కసి, అందరు హీరోలలో పెంచింది.

తెలుగు-తమిళం-మలయాళం- కన్నడం- హిందీ ఆడియెన్స్ కి యాప్ట్ అయ్యే యూనివర్శల్ కథాంశాల్ని ఎంచుకునెందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే బడ్జెట్లు విషయంలో మరీ గట్టిగా పెట్టుకుని నిర్మాణంలోకి దిగిపోయారు. అయితే అనుకోకున వచ్చిన కరోనాతో ఆ ఎఫెక్ట్ ని నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు.  నిర్మాతల బర్డెన్ ను పట్టించుకోకుండా భారీ బడ్జెట్ సినిమాలకి ప్లాన్ చేశారు. కరోనా కారణంతో ఒకవైపు సంక్షోభంలో కూరుకుపోయిన సినీ పరిశ్రమకు ఈ భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద తలనొప్పిగా మారి పో్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: