ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... మరో రెండు రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేసే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ యూనిట్ కాస్త ముందుగా ఉందనే చెప్పాలి. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘యూవీ క్రియేష‌న్స్’ ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.



ఇదిలా ఉండగా.. తాజాగా `రాధేశ్యామ్‌` నుండీ యంగ్ రెబల్  స్టార్    ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌ని రివీల్ చేస్తూ.. ఓ పోస్ట‌ర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ‘విక్రమాదిత్య’ అనేది ప్రభాస్ క్యారెక్టర్ అని తెలిపారు.మొన్నటికి మొన్న పూజా హెగ్డే క్యారెక్టర్ పేరు ‘ప్రేరణ’ అని కూడా వారు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్ పేరు రాధ‌, హీరో పేరు… ‘శ్యామ్’ అని ఉంటాయని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ.. ఇద్దరి క్యారెక్టర్ల పేర్లు వేరుగా ఉన్నాయి.

అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం..    ఈ చిత్రంలో రాధ‌ మరియు శ్యామ్ పాత్రలు కూడా ఉంటాయట‌. వాటికి సంబంధించి కూడా ఓ సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మరి చిత్ర యూనిట్ సభ్యులు ఆ లుక్స్ ను ఎప్పుడు రివీల్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇంకా మరిన్ని మూవీ అప్ డేట్స్ కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: