రాధే శ్యామ్ కోసం ప్రభాస్ బాగా మేకోవర్ అయ్యారు. ఇటీవల అడవుల్ని దత్తత తీసుకున్న సందర్భంగా ప్రభాస్ బైటకొచ్చిన సందర్భంలో ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ తో మరింత్ క్లారిటీ వచ్చేసింది. అవును.. బాహుబలికోసం బాగా కండలు పెంచిన ప్రభాస్, సాహో కోసం అదే లుక్ మెయింటెన్ చేశాడు. హల్క్ లాగా సాహోలో అదరగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తనదైన స్టైలిష్ మేనరిజమ్ లోకి వచ్చేశాడు ప్రభాస్. రాధేశ్యామ్ లో మిర్చి సినిమా లుక్ క్యారీ చేయబోతున్నాడు.
ప్రభాస్ సినిమాలు ఎన్ని ఉన్నా.. ఇప్పటికీ ఆయన అభిమానులకు మిర్చి మూవీలోని స్టైలిష్ లుక్స్ బాగా ఇష్టం. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా.. కొరటాల శివ ప్రభాస్ ని ఎలివేట్ చేసినట్టుగా.. ఇంకెవరూ చేయలేకపోయారు. సబ్జెక్ట్ ప్రకారం బాహుబలి విషయాన్ని పక్కనపెట్టినా సాహో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. పాటలకంటే ఫైట్స్, గన్స్ ఎక్కువగా హైలెట్ కావడంతో ప్రభాస్ ని కేవలం యాక్షన్ హీరోగా మాత్రమే చూడాల్సి వచ్చింది.
ఇప్పుడు రాధే శ్యామ్ లో ప్రభాస్ కంప్లీట్ మేకోవర్ అయి కనిపిస్తున్నారు. రాధేశ్యామ్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లోఈ విషయం స్పష్టమవుతోంది. విక్రమాదిత్యగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు ప్రభాస్. లవ్ బేస్డ్ సబ్జెక్ట్ కావడంతో.. దీంట్లో ప్రభాస్ లవర్ బాయ్ లాగా కనిపించాలి, అందుకే ఆయన కాస్త సన్నబడ్డారు. రాధేశ్యామ్ లో వాడే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా డార్లింగ్ మంచి కేర్ తీసుకున్నట్టు అనిపిస్తోంది. బ్రైట్ కలర్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. మొత్తమ్మీద రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ తో ప్రభాస్ ప్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక టీజర్ వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవని తేలిపోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: