దగ్గుబాటి రానా పాన్ ఇండియా మూవీ అయినా అరణ్య లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వెరైటీ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు..టీజర్ కి మంచి స్పందన వచ్చింది కానీ కరోనా అన్ని సినిమాలపై ప్రభావం చూపించినట్లుగా ఈ సినిమా పై కూడా గట్టి ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.

బాహుబలి కంటే ముందే రానా కు పలుభాషల్లో మంచి పరిచయముంది.. అంతకుముందే రానా తమిళ, హిందీ సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను మురిపించాడు.. అయితే అది అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదని చెప్పాలి.. ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని మాత్రం చెప్పేశాడు.. బాహుబలి తర్వాత  రానా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.. నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి..

అరణ్య రిలీజ్ విషయంలో ఒకరకమైన కన్ఫ్యూజన్ మొన్నటిదాకా నెలకొంది. ఇప్పుడు దానికి చెక్ పెట్టేశారు. 2021 మకర సంక్రాంతి సందర్భంగా అరణ్యను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనూ ప్రచారం విస్తృతం చేశారు. మొన్నటిదాకా ఓటిటిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపించిన ముంబై టాక్ కు భిన్నంగా ఎరోస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. అప్పటికంతా పరిస్థితి సద్దుమణిగి పోవచ్చు. పబ్లిక్ మునుపటి లాగే రెగ్యులర్ గా సినిమా హాళ్లకు రావొచ్చు. అందుకే అన్నీ ఆలోచించి పండగను సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: