రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత అంతకుమించి అనేలా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు జక్కన్న. ఇక సినిమాలో ఇద్దరు స్టార్స్ ఇద్దరు రియల్ ఫ్రీడం ఫైటర్స్ ను ప్రతిభింభించే పాత్రలతో వస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో తారక్, మన్యం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ దుమ్ముదులిపేయనున్నారు.

అల్లూరి సీతారామరాజుకి సంబందించిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది. మా అన్న మన్యం దొర అల్లూరి సీతారామ రాజు అంటూ ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ ఆ టీజర్ కు మరింత బలాన్ని ఇచ్చింది. ఇక ఈరోజు కొమరం భీమ్ టీజర్ రాబోతుంది. ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. నిన్న శాంపిల్ గా ఓ ప్రీ టీజర్ రిలీజ్ చేసి మరింత ఆసక్తి పెంచాడు చరణ్.

చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ కొమరం భీమ్ టీజర్ ఇదివరకు టీజర్ రికార్డులన్ని బద్ధలు కొట్టి సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉంది. కొమరం భీమ్ టీజర్ రాజమౌళి మార్క్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ టీజర్ తో సినిమా రేంజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయిని తెలియచేసేందుకు సిద్ధమయ్యాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు సూపర్ స్టార్స్ తో రాజమౌళి చేస్తున్న ఈ క్రేజీ మూవీ సెన్సేషన్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: