తెలుగు లో విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమాతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంది రష్మీక మందన్నా . అక్కడితో ఆమె దశ తిరిగింది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటిస్తూ, ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ భామ ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషకం తీసుకుంటుంది. ఇదిలా ఉంటె ఈమె ఇటు సినిమాలతో పాటు తన ఫిజిక్ విషయంలో కూడాఎంతగానో కష్టపడుతుంది. రష్మిక ఆహార నియమాలు పాటించడంతో పాటు రెగ్యులర్ ఉదయాన్నే బీచ్ లో వర్కౌట్స్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా రష్మిక తన వార్కౌట్స్ వీడియోలను, ఫోటోలను సామాజిక మధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అభిమానులతో ఎప్పటికప్పుడు చాలా విషయాలు పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటె ఇప్పుడు రష్మిక మందన్న ఇటీవల ఫిట్నెస్ ఫ్రీక్ గా మారాక సాటి నాయికలతో పోటీపడుతోంది. రెగ్యులర్ గా స్కిప్ కొట్టకుండా జిమ్ కి వెళుతోంది. ఇదిగో ఇదే లేటెస్ట్ ప్రూఫ్.తాజాగా తన ఫిట్నెస్ గేమ్ గురించి అభిమానులను అప్ డేట్ చేసేందుకు రష్మిక ప్రిపరైందిలా. 'హస్టిల్ గా ఉంది..' అనే క్యాప్షన్ తో ఓ స్పోర్ట్ బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తోందిలా.అటు బెంగళూరులో అయినా..ఇటు హైదరాబాద్ లో అయినా జిమ్ కు వెళ్లేటప్పుడు ఈ స్పెషల్ బ్రాండ్ ట్రాక్ ని స్పోర్ట్ డ్రెస్ ని ఎంపిక చేసుకుంటోందట.కెరీర్ పరంగా చూస్తే.. కన్నడ చిత్రం పోగారులో ధ్రువ సర్జా సరసన నటిస్తోంది.తెలుగులో పుష్ప చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది.

అటు తమిళంలోనూ కార్తీ సరసన అవకాశం అందుకుంది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లోని పుష్ప వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.అప్పటికి రష్మిక ఈ టీమ్ తో జాయిన్ అవుతుందట.ఇక ఈ ఏడాది మహేష్ సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ సినిమాలతో మంచి విజయాలు సొంత చేసుకున్న రష్మీకకు ఇప్పుడు అన్ని ఇండ్రస్టీ లలో వరుస అవకాశాలు వస్తున్నాయి.మొత్తం మీద ఈ అమ్మడు అటు సినిమాల్లో...ఇటు సోషల్ మీడియాలో మంచి దూకుడ్ని కనబరుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: