జీ తెలుగులో దసరా స్పెషల్ గా వస్తున్న చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది ప్రోగ్రాంలో ఆట పాటలతో అదరగొట్టనున్నారు. నాగబాబు బొమ్మ అదిరింది టీంతో పాటుగా డ్యాన్సర్స్ కూడా కొందరు పర్ఫార్మ్ చేశారు. నిహారిక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మాఉలుగా జానీ మాస్టర్ అదరగొటతాడు ఇందులో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు జానీ మాస్టర్ లేడీ గెటప్ లో డ్యాన్స్ చేయడమే ఇక్కడ స్పెషల్.  

మొన్నామధ్య ఢీ కంటెస్టంట్ పండు నక్కిలీసు గొలుసు సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. పండు వేసిన ఆ సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ సాంగ్ తర్వాత పండుకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు పండు దారిలోనే జానీ మాస్టర్ లేడీ గెటప్ లో సాంగ్ చేశాడు. దసరా స్పెషల్ గా వచ్చిన ఈ షోలో జానీ మాస్టర్ డ్యాన్స్ దుమ్ముదులిపేసేలా ఉంది. జానీ మాస్టర్ వేసిన లేడీ గెటప్ లోని సాంగ్ కు స్టేజ్ దద్దరిల్లిపోయింది.

చూస్తుంటే ఈ షోకి అదే హైలెట్ అయ్యేలా ఉంది. ఇక తన లేడీ గెటప్ లో డ్యాన్స్ వేయడంపై స్పందించిన జానీ మాస్టర్ మగవాళ్లు ఓ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది కాని ఆడవాళ్లు ఎంత కష్టపడాల్సి వస్తుందో తనకు ఇప్పుడు అర్ధమయ్యిందని అన్నాడు. మొత్తానికి పండుతో పాటుగా జానీ మాస్టర్ ఫీమేల్ డ్యాన్స్ తో షో సూపర్ సక్సెస్ అయ్యేలా ఉంది.                                                          


 

మరింత సమాచారం తెలుసుకోండి: