ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలామంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. థియేటర్ లో ఓపెన్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి అనుమతులు ఇవ్వగా... చాలా చోట్ల ఇంకా థియేటర్లు ఓపెన్ కావడం లేదు. థియేటర్లు ఓపెన్ చేయడానికి నిర్వాహకులు రెడీగా ఉన్నా నిర్మాతలు మాత్రం తమ సినిమాలను విడుదల చేసేందుకు సాహసం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసించడం లేదు.


అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమాలన్నీ కూడా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు తమ సినిమాలను ఒకేసారి విడుదల చేయకుండా.. ఒకటి లేదా రెండు నెలల సమయం గ్యాప్ ఇచ్చి విడుదల చేయాలని నిశ్చయించుకున్నారట. అయితే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "సోలో బ్రతుకే సో బెటర్" తెలుగులో థియేటర్లలో విడుదల కాబోతున్న మొట్టమొదటి సినిమా అని తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఏ కొత్త సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాలేదు. నిజానికి జీ 5 యాజమాన్యం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ని కొనుగోలు చేయాలనుకున్నారు కానీ తర్వాత తమ ఆలోచనను విరమించుకున్నారు.


దీంతో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రబృందం తమ సినిమాని నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం సెన్సార్ బోర్డ్ నుండి యు సర్టిఫికెట్ పొందింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెచ్చుకున్నప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఐతే సినిమా థియేటర్ల అనుభూతి పొందక చాలా సమయం గడుస్తున్న నేపథ్యంలో తమ సినిమాకి చాలా మంది ప్రేక్షకులు వస్తారని సోలో బ్రతుకే సో బెటర్ సినీ బృందం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: