అవునూ.. ఓ ఐటమ్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించింది. అయితే తనకంటూ 6 సంవత్సరాలు చిన్నవాడైన వ్యక్తితో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుఖార్లు షికారు చేస్తున్నాయి. అయితే వీటిపై స్పందించిన ఆ ఐటమ్ గర్ల్ ఏం చెప్పింది? ఇంతకీ ఆమె ఎవరు? మరి 6 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తి ఎవరు? వారు ప్రేమలో ఉన్నారా? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి "శంకర్‌దాదా ఎంబిబిఎస్"లో "నా పేరే కాంచనమాల" ఐటమ్ సాంగ్ చేసిన గౌహర్ ఖాన్ గుర్తుందా? అప్పట్లో ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట తర్వాత అమ్మడుకి వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు అందరు. కానీ.. ఆ పాట తరవాత తెలుగులో పాటలు గాని, సినిమాలు గానీ చేయలేదు. అయితే హిందీలో మాత్రం స్పెషల్ సాంగులు, టీవీ షోలు చేసింది.
ఇదిలా ఉంటే.. ఈమె కొంతకాలంగా సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు, తనకంటే వయసులో ఆరేళ్లు చిన్నవాడైన జాయేద్ తో ప్రేమలో ఉందని హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. గౌహర్‌తో దిగిన ఫోటోలను జాయేద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. కానీ, ఎక్కడా ప్రేమలో ఉన్నామని చెప్పలేదు. ప్రేమ విషయం కన్ఫర్మ్ చేశారా? లేదా? అనేది పక్కన పెడితే... నవంబర్ లో గౌహర్ ఖాన్, జాయేద్ దర్బార్ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ టాక్. పెళ్లికి నవంబర్ 22న ముహూర్తం ఫిక్స్ చేశారని ముంబై మీడియా రిపోర్ట్ చేసింది. గౌహర్ సిస్టర్ నిగార్ సహా ఇతర తోబుట్టువులు, బంధువులు విదేశాల నుండి వస్తున్నారని వార్తలొచ్చాయి. ప్రస్తుతం "బిగ్ బాస్"లో ఉన్న గౌహర్ ఖాన్.. వీటిపై స్పందించింది. కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా విశేషం ఉంటే తాను చెబుతానని గౌహర్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: