మన తెలుగు యువ హీరోల్లో ప్రధానంగా నాని కి ప్రత్యేక శైలి ఉంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు ఎందుకు చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాడు అనే మాట వాస్తవం. దాదాపు రెండేళ్ల నుంచి నాని సినిమాలు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. వరుసగా సినిమాలు హిట్ కొట్టిన నాని ఇప్పుడు ఒక హిట్టొచ్చినా చాలు అనుకునే పరిస్థితి ఉంది.

అయినా సరే నాని తో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు ఎక్కువగా టాలీవుడ్ వర్గాల్లో వినబడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు గానీ... నాని ఇప్పుడు మాత్రం కాస్త సినిమాల విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. తన సినిమాల్లో కథ లేకపోవడంతో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. దీంతో తన సినిమాలకు కథలు రాసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు నాని ఒక కథను తయారు చేస్తున్నాడని, త్వరలోనే దీనికి సంబంధించి ఒక దర్శకుడి తో కూడా చర్చించి తన ఆలోచనలను పంచుకున్నాడు అని టాక్.

ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా తన సినిమాకు తానే దర్శకుడుగా వ్యవహరించుకునే అవకాశాలు కూడా ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే అది ఎంతవరకు నిజం అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు తన సినిమాకు తానే డైరెక్టర్ కావాలి అని నాని ఆలోచించటం మాత్రం కొంత మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: