టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది... మూడు పదుల వయసు దాటుతున్నా మెరిసిపోయే అందంతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నా చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రావడం లేదు. దీంతో ఆమె హీరోయిన్ లెక్క నుండి బయటకు వచ్చి నెగటివ్ రోల్ కూడా చేస్తోంది.
హీరోయిన్‌ గా  సక్సెస్‌లు ఉంటేనే కెరీర్‌కి గ్యారెంటీ ఉండట్లేదు.


అలాంటిది నెగటివ్‌ రోల్‌ వైపు వెళ్తే కెరీర్‌ ఉంటుందా.. మరి బోల్డ్‌ విలన్‌గా కనిపించబోతోన్న తమన్న పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఎదురవతున్నాయి. ఈమె నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు అంధాదున్‌ లో నెగటివ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమా ఈ అమ్మడికి ప్లస్‌ అవుతుందా.. మైనస్‌ అవుతుందా?
ఈమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడనుందా అనే చర్చలు జరుగుతున్నాయి. నిజానికి తమన్నా కెరీర్‌ బ్యాడ్ ఫేజ్‌ లోకి వెళ్లిపోయి చాలా రోజులవుతోంది. ఈమెకి స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ వస్తున్నాయి గానీ హీరోయిన్ రోల్స్ మాత్రం రాట్లేదు.


ఇప్పటికే ఇలా ఉన్న సమయంలో  'అంధాదున్' రీమేక్‌ కి సైన్‌ చేసింది తమన్న. ఈ మూవీలో లేడీ విలన్‌ గా నటించబోతోంది తమన్నా. హిందీలో టబు నటించిన  క్యారెక్టర్‌ ని ఇక్కడ తమన్నా చేస్తోంది. సినిమా కథ ప్రకారం ఈ క్యారెక్టర్‌ కి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంటుంది. ఈ సంబంధం కోసం భర్తని కూడా చంపేస్తుంది. హత్యని చూసిన హీరోని కూడా చంపాలనుకుంటోంది. ఇలాంటి క్యారెక్టర్‌ చేస్తున్న తమన్నా కెరీర్‌ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే దాని మీదే ఆమె కెరీర్ ఆధార పడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: