మన తెలుగులో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సినిమాలను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. సినిమాలను విడుదల చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు. ప్రధానంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల చేస్తే ఇప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని కొన్ని సినిమాలకు సంబంధించి నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో వస్తున్న కొన్ని వార్తలు సినీప్రపంచాన్ని కాస్త కంగారు పెడుతున్న పరిస్థితి.

ప్రధానంగా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసినా సరే సినిమాలు చూడడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. దీనిపై టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి అని టాలీవుడ్ జనాలు కూడా కాస్త కంగారు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి సినిమాలకు అసలు పెద్దగా ఎవరూ కూడా ప్రేక్షకులు వెళ్లడం లేదు. అటు పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను అసలు తెరవడానికి థియేటర్ల యజమానులు కూడా రెడీగా లేరు అని తెలుస్తుంది.

మరి ఎంత కాలం ఈ పరిస్థితి ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే పెద్ద హీరోల సినిమాలను విడుదల చేస్తే అనవసరంగా నిర్మాతలు నష్టపోయే సూచనలు ఉంటాయి. సినిమాలను ప్రేక్షకులు ఎవరూ చూడకపోవడంతో భారీగా వసూళ్లు వచ్చే అవకాశాలు కూడా లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు పెద్ద హీరోలు మన తెలుగులో వెనకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది సినిమాలను ఇక మర్చిపోదాం అని వచ్చే ఏడాది సినిమాల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం మన స్టార్ హీరోలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: