నాగార్జున గత రెండు సీజన్ల నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నారు. ఆయన తనదైన స్టైల్ లో షోని అదరగొడుతున్నారు. వీకెండ్స్ లో బిగ్ బాస్ కి వస్తున్న రేటింగ్స్ ఆ సంగతి చెబుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే నాగ్ ప్రస్తుతం  కులుమనాలిలో సినిమా షూటింగులో ఉన్నారు. ఆయన వైల్డ్ డాగ్ అన్న మూవీలో హీరోగా  యాక్ట్ చేస్తున్నారు. దాంతో ఆయన ఈ వారం ఎపిసోడ్స్ కి హాజరు కారు అన్న మాట వినిపిస్తోంది. నిజానికి గత వారమే  నాగ్ రారు అన్న గాసిప్స్  పెద్ద ఎత్తున  స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం ఆయన కచ్చితంగా రారు అంటున్నారు.

ఆయన కులుమనాలీ షూటింగులో తాజాగా  జాయింగ్ అయ్యారుట. కచ్చితంగా కొన్ని రోజులు కంటిన్యూస్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. దాంతో ఆయన కోడలు సమంత ఈసారి వీకెండ్ లో మెరవనున్నారని అంటున్నారు. వీకెండ్ లో ఆమె వస్తారన్న వార్తలు ప్రచారం కావడంతో బిగ్ బాస్ లో ఈ వీకెండ్ మీద మరింత ఇంటెరెస్ట్ పెరిగిపోతోంది.

సమంత టాప్ హీరోయిన్. పైగా యూత్ కి బాగా  కనెక్ట్ అయి ఉంటారు. ఆమె కనుక షో చేసే ఆ రేటింగ్ బీభత్సంగా ఉంటుందని కూడా అంటున్నారు. దానికి తోడు నాగ్ ఈసారికి సమంతని హోస్ట్ చేయమని తానే స్వయంగా రికమండ్ చేశారని అంటున్నారు. దాంతో మామ నాగ్ ఆశీస్సులతో ఆమె ఈ వీకెండ్ ని ఫుల్ జోష్ గా చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే సీజన్ మూడు లో కూడా రమ్యక్రిష్ణ ని ఒక వీకెండ్ కి హోస్ట్ గా రప్పించి  బిగ్ బాస్ సందడి చేయించిన సంగతి విధితమే. ఇపుడు ఆ బాధ్యతను సమంత తీసుకోబోతున్నారు అని టాక్. మొత్తానికి ఈ వీకెండ్ లో ఆమె రావడం అంటూ జరిగితే భలే పసందుగా షో ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: