కరోనా వైరస్ ఇంకా తగ్గలేదు. కానీ లాక్ డౌన్ కంప్లీట్ అయింది. అన్ని వ్యవస్థలు యధాప్రకారం నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సినిమా షూటింగులకు కూడా అంతా రెడీ అవుతున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు సెట్స్ మీదకు రావాలని అనుకుంటున్నారుట. టాప్ సీనియర్లలో మెగాస్టార్ అచార్య సినిమా సెట్స్ మీద ఉంది. చిరంజీవి దసరా తరువాత జాయిన్ అవుతారు అని అంటున్నారు. ఇక బాలయ్య బోయపాటి మూవీకి సంబంధించి అప్ డేట్స్ చూసుకుంటే ఆయన కూడా నవంబర్ నుంచి షూటింగ్ కి వస్తానని హామీ ఇచ్చారని అంటున్నారు.

మరో వైపు సీనియర్ హీరో నాగార్జున అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులూ మనాలీ వెళ్లారు. నాగార్జున సీనియర్ హీరోలలో చాలా కాలం క్రితమే షూటింగ్ బాట పట్టేసారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన బిగ్ బాస్ సీజన్ ఫోర్ ని కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ నిజానికి నారప్ప షూటింగ్ లో బిజీ కావాలి. కానీ ఆ మధ్యలో రానా పెళ్ళి ఉండడంతో ఆగారు. ఇపుడు పండుగలు అన్నీ చూసుకుని వచ్చే నెల నుంచి నారప్ప షూటింగ్  కి రెడీ అవుతున్నారని టాక్.

ఈ సినిమాలో రాయలసీమ నేపధ్యం కలిగిన పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. దాని కోసం ఆయన గడ్డం బాగా పెంచుతున్నారు. ఈ మూవీకి తగినట్లుగా ఆయన తన బాడీని మౌల్డ్ చేసుకుంటున్నారు. తమిళంలో హిట్ అయిన ఒక మూవీకి ఇది రీమేక్. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత వెంకీ మరిన్ని సినిమాలు కమిట్ అయ్యారు. దాంతో రానున్న రెండు మూడు నెలల్లో నారప్పను కంప్లీట్ చేయాలనుకుంటున్నారుట. మరో వైపు వెంకటేష్ కోసం ఎఫ్ 3 స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రం కూడా వెంకీతో ఓ మూవీ చేయాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: