తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు మన జక్కన్న.ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో మన రాజమౌళి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. మళ్ళీ అదే రేంజ్ లో సినిమా తీయాలనే పట్టుదలతో,టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే RRR. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అల్లూరిగా, చెర్రీ... కొమురం భీంగా తారక్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు హాలీవుడ్ నటీ, నటీలు కూడా నటిస్తున్నారు.

 ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో పాటుగా, రామ్ చరణ్ టీజర్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా కొమరం భీమ్ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీయార్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తాజాగా తెరపడింది. ఎన్టీయార్‌కు, ఆయన అభిమానులకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అదిరిపోయే బహుమతిని అందించేశాడు. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను విడుదల చేశాడు. `ఆర్ఆర్ఆర్`లో కొమరం భీమ్‌గా చేస్తున్న ఎన్టీయార్ పాత్ర తీరుతెన్నులను పరిచయం చేస్తూ ఈ వీడియోను రూపొందించారు.`వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.

నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అంటూ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీయార్ పాత్రను పరిచయం చేశారు. ఎన్టీయార్ పోరాట వీరుడిగా అద్భతంగా కనిపించాడు.ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యిందనే చెప్పాలి.మొత్తం మీద మన జక్కన్న అందించిన ఈ కానుకకు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: